కామారెడ్డి, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని జెడ్పి చైర్ పర్సన్ శోభ ప్రారంభించారు. సిపిఆర్ చేయు విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సిపిఆర్ చేయడంవల్ల వ్యక్తిప్రాణాలను కాపాడవచ్చని సూచించారు.
ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సిపిఆర్ చేయు విధానాన్ని నేర్చుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఆరోగ్య, వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.