ఆర్మూర్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా కోమన్ పల్లి గ్రామ పంచాయితీ స్నేహపురితమైన మహిళా విభాగంలో ఎంపికైంది. కాగా శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగ జ్ఞాపిక అందజేసి సన్మానించారు.
గ్రామ పంచాయతీ పాలక సిబ్బందికి, ఏఎన్ఎం, ఆశ వర్కర్, అంగన్వాడి టీచర్, ఐకేపీ సిఏ, వివొలను సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, జిల్లా పాలక సిబ్బంది, గ్రామ పంచాయితీ సిబ్బంది, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ మాట్లాడుతూ అవార్డు పొందడానికి తనకు సహకరించిన ఏమెల్యే జీవన్ రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలకు మహిళలకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.