ఆర్మూర్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయి పురస్కారాలలో భాగంగా శనివారం నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లాలో క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రతలో మొదటి అవార్డు సాధించిన అర్గుల్ గ్రామపంచాయతీకి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పంచాయతీ అధికారిని జయసుధ చేతుల మీదుగా అందజేశారు.
గ్రామసర్పంచ్, ఉప సర్పంచ్, పద్మ రాజేందర్, వార్డ్ మెంబర్స్, పంచాయతీ కార్యదర్శి, కోఆప్షన్ మెంబర్, జిల్లాలో మొదటి స్థానం ఎంపిక కావటానికి కృషిచేసిన అర్గుల్ గ్రామపంచాయతీ పాలకవర్గానికి, పారిశుద్ధ కార్మికులకు, ఉపాధి హామీ కూలీలకు, సమస్త అర్గుల్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే గ్రామాన్ని క్లీన్ అర్గుల్, గ్రీన్ అర్గుల్గా ఉంచుకుందామని ఆకాంక్షించారు.