నిజామాబాద్, మార్చ్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27, 28 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ సారంగాపూర్లోని బీఈడీ కాలేజీలో జాతీయ సదస్సు ‘‘జాతీయ విద్యా విధానం 2020 అవకాశాలు – సవాళ్లు’’ అనే అంశంపైన నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎ. మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ సదస్సుకు ముఖ్య వక్తలు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఇతర బి.ఈ.డి కళాశాలల లెక్చరర్లు, పరిశోధక విద్యార్థులు అందరూ పాల్గొంటారని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ సారంగాపూర్ బిఈడి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.