కామరెడ్డి, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయుల జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మహనీయుల జయంతి వేడుకలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
గ్రామాలలో, మున్సిపాలిటీలలో అంబేద్కర్, జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు నిర్వహించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జయంతి వేడుకల సందర్భంగా సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి వెంకటేష్, సహాయ బిసి అభివృద్ధి అధికారి యాదగిరి, సమన్వయ కమిటీ ప్రతినిధులు మల్లయ్య, రాజలింగం, రాజయ్య, సిద్ధి రాములు, శివరాములు, దేవుల, నరేందర్, బాలయ్య పాల్గొన్నారు.