మేడ్చల్, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పైచదువులకు పునాది వంటిదని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తుండడంలో బడుల్లో ప్రవేశాలు దొరకని స్థాయికి ఎదిగిందంటే ఈ ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 150 మందికి ప్యాడులు అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారని, గురుకుల పాఠశాలలు దేశానికి ఆదర్శంగా మారాయని అన్నారు. చదువుతోనే అజ్ఞానాన్ని తొలగించవచ్చని, మంచిని సమాజానికి చాటి చెప్పాలని పేర్కొన్నారు. జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించాలని సూచించారు.
పరీక్షల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10 వేలు, ఐదువేల బహుమతులు అందజేస్తానని వెల్లడిరచారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహేష్, నాయకులు సాదిక్, శ్రీనాథ్, శ్రీమన్నారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.