నిజామాబాద్, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన కరువు భత్యాన్ని అమలు చేయాలి ఈరోజు ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వై. ఓమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన కరువు భత్యాన్ని ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి బీడీ పరిశ్రమలో కార్మికులకు, బట్టి, చాటన్, బీడీ ప్యాకింగ్, జల్లి లేబుల్ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీడీ కార్మికులకు పెరిగిన విడిఎ ప్రకారం 232 రూపాయల నాలుగు పైసలు ఇవ్వాలని, ప్యాకర్స్ ఇతర కార్మికులకు రోజుకు 9 రూపాయల 40 పైసలు చొప్పున చెల్లించాలని లేనియెడల ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నర్సింగరావు, బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ భానుచందర్, సహాయ కార్యదర్శి డి మహేష్, ఉపాధ్యక్షులు సిహెచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.