రామారెడ్డి, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందుతుందా?, ప్రామాణికత పాటిస్తున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. హాస్టల్లోని ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థిని విద్యార్థులకు దేశంలో ఏ రాష్ట్రంలో విధంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య సన్న బియ్యం నాణ్యమైన ఆహారం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. ఈ ఘనత కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ఉద్యమకారుడు కనక విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
విద్యార్థులు మంచిగా చదువుకొని విద్య ఉద్యోగాలలో ప్రైవేట్ రంగంలో గాని, ప్రభుత్వ రంగంలో గాని ఉన్నత ఉద్యోగాలు పదవులు, వివిధ వ్యాపారాలు పొందాలని చదువు చెప్పిన గురువులను తల్లిదండ్రులను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్దలను మరువరాదని విద్యార్థులకు హితవు పలికారు. ఏ సమయం వచ్చిన చదువు విషయంలో మీకు పూర్తి సహాయ సహకారం ఉంటుందని అర్దరాత్రి నాకు ఫోన్ చేసిన మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా విద్యార్థులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు భాగ్యలక్ష్మి, శాం పాల్గొన్నారు.