కామారెడ్డి, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాజాగా ప్రకటించిన ఐఎన్‌టిఎస్‌ఓ (ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్) జాతీయ పరీక్ష ఫైనల్ ఫలితాలలో శ్రీ చైతన్య కామారెడ్డి బ్రాంచ్‌కు చెందిన 80 మంది విద్యార్థులు సత్తా చాటి వారి ప్రతిభను నిరూపించుకున్నారని కామారెడ్డి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ కే స్వర్ణలత అన్నారు.
వీరిలో ఆరవ తరగతికి చెందిన ఏ కమల్ నాయుడుకు రెండవ బహుమతి, నాలుగవ తరగతికి చెందిన పి ఘనహాసిత్‌కు నాలుగవ బహుమతి, మూడవ తరగతి చెందిన జి గీతాదీపిక మరియు తొమ్మిదవ తరగతికి చెందిన ఏ అభిరామ్‌లకు ఐదవ బహుమతిని అందుకున్నారని తెలిపారు.
ఇవేకాక 19 మంది కన్సోలేషన్ బహుమతులు, 38 గోల్డ్ మెడల్స్, 75 మెరిట్ సర్టిఫికెట్లు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అభినందిస్తూ శ్రీ చైతన్య పాఠశాలలో పోటీ పరీక్షలలో గెలుపొందే విధంగా కార్యాచరణ రూపొందించడం దానిని అనుసరిస్తూ పాఠ్యా ప్రణాళిక ద్వారానే ఇటువంటి ఫలితాలు రావడం జరుగుతుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కే స్వర్ణలత అకాడమిక్ డీన్ సంపత్ కుమార్ మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.