కామారెడ్డి, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాడ్వాయి మండలం దేమి కాలన్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమానికి హాజరైన ప్రజల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన కళ్లద్దాల వివరాలు అరా తీశారు. కార్యక్రమంలో వైద్యులు, మండల అధికారులు పాల్గొన్నారు.