రెంజల్, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై స్పందించడంతో పెరుగుతున్న ప్రజా ఆదరణను చూసి బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామిక చర్యని దుయ్యబట్టారు. దేశప్రజలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ఆదరిస్తున్నారని కాంగ్రెస్‌కు వస్తున్న ప్రచారం ప్రజాదరణ చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా తప్పుడు ఆరోపణలతో పార్లమెంటు సభ్యతాన్ని రద్దు చేయడం సమంజసం కాదని అన్నారు.
ఇటీవలే రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్రకు ప్రజలనుండి అనూహ్య స్పందన లభించిందని స్పష్టం చేశారు. లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామిక చర్యని దుయ్యబట్టారు. ప్రజల సొమ్మును దోచుకుని పారిపోయిన వారిని తీసుకురాకుండా, బిజెపి ప్రభుత్వ రంగ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడాన్ని పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఎండగట్టినందుకు రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయడం ప్రశ్నించే గొంతుకలను అణచివేత ధోరణికి బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుందన్నారు.
2019లో మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుబట్టి సూరత్‌లో కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని తమ నాయకుడు రాహుల్ గాంధీకి కోర్టు ద్వారా న్యాయం జరిగి నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ ప్రధానకార్యదర్శి జావిదోద్దిన్, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాములు, సాయరెడ్డి, నాయకులు సురేంధర్ గౌడ్, గయాసుద్దీన్, గంగాకృష్ణ, సాయిబాబా గౌడ్, ఎంఎల్ రాజు, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కార్తీక్, యూత్ మీడియా ఇన్ఛార్జి లోక కృష్ణ, నాయకులు పోచయ్య, సిద్ధ సాయిలు, శంషోద్దీన్ తదితరులు ఉన్నారు.