నిజామాబాద్, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా మహిళా, శిశు వికలాంగుల మరియు సీనియర్ సిటిజెన్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పోషణ -పక్షం కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రాయ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ నెల మూడవ తేదీ వరకు కొనసాగనున్న పోషణ్ పక్వాడలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె సుధారాణి తెలిపారు.
తెలంగాణ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు సుదాం లక్ష్మి, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్ర, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, ఇంచార్చ్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి, జిల్లా సివిల్ సప్లై అధికారి చంద్రప్రకాశ్ , మెప్మా ప్రాజెక్ట్ అధికారి రాములు, సీడీపీఓ లు, సూపర్ వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.