విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ గ్లోరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. విద్యార్థులు తల్లితండ్రులకు బహుమతులు అందజేశారు.

శ్రీ చైతన్య ప్రిన్సిపాల్‌ స్వర్ణలత మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో కుటుంబం తల్లిదండ్రుల విలువలు మానవ సంబంధాలు ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ ఫ్యామిలీ గ్లోరి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులను గౌరవించడమే కాకుండా తోటి వారి తల్లిదండ్రులను గౌరవించేలా వారికి అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య కామారెడ్డి ప్రిన్సిపల్‌ కే స్వర్ణలత, శ్రీ చైతన్య అకాడమిక్‌ డీన్‌ సంపత్‌, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Blog heading and website banner of laptop with female typing hands, copy space in grey color. Concept of advertisement of bitcoin and cryptocurrency, modern technology and programming.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »