కామారెడ్డి, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ, ప్రభుత్వ పాఠశాలలో సోనియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ భలేరావు ట్రస్ట్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ 45 రోజుల ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచిత టైలరింగ్ క్యాంప్ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీలకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌లు పంపిణీ చేశామన్నారు.
ముఖ్య అతిథులు, ట్రస్టీ సభ్యులు టైలరింగ్ యొక్క 45 రోజుల శిక్షణ గురించి, సర్టిఫికేట్ వారికి వివిధ మార్గాల్లో ఎలా ఉపయోగపడతాయో క్లుప్తంగా వివరించారు. నేటి జీవితంలో పని అనే అంశంలో మహిళా అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలిపారు. విద్యార్థులు శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడంతో వారి కృషిని కొనియాడారు. టైలరింగ్ వల్ల మహిళలకు గృహిణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాణిక్యం శర్మ, గురుచరణ్, కల్కి శ్రీధర్, కల్కి శృతి, ట్రస్ట్ మెంబర్లు రిజ్వానా, నాగమణి, మరియు ఫౌండేషన్ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు శంకర్ భలేరావు, వైస్ చైర్మన్ సోనియా, కరణ్ ప్రధాన కార్యదర్శి, అర్జున్ జాయింట్ సెక్రటరీ పాల్గొన్నారు.