నిజామాబాద్, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముందస్తుగా ఆసుపత్రి ఖర్చులకోసం, మరియు ఆపరేషన్ తర్వాత ఆర్థిక సహాయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకారంతో, నిజామాబాద్ గ్రామీణ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులు మొత్తం 42 మందికి రూ. 14 లక్షల 18 వేల 100 లబ్ధిదారులకు సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జెడ్పిటిసి, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్ చేతుల మీదగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి దాసరి ఇంద్రా లక్ష్మీ నరసయ్య, మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు గీత, మాజీ అధ్యక్షులు చక్కరి కొండ కృష్ణ, దళిత నాయకుడు పద్మారావు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపిటిసిలు, ఉప సర్పంచ్లు, కార్యకర్తలు, బిఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంఘల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.