నందిపేట్, ఏప్రిల్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్ధరాత్రి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా బుధవారం నందిపేట్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భూతం సాయరెడ్డి, జిల్లా సెక్రెటరీ పోతుగంటి సురేందర్, కిషోర్ మోర్చా అధ్యక్షులు గడ్డం చిన్నారెడ్డి, ఎంపిటిసి సభ్యులు అట్టోలి సంజీవ్, జనరల్ సెక్రెటరీ సూది సాయికుమార్, భోగ రాము, నందిపేట్ వార్డ్ సభ్యులు ఆరుట్ల రమేష్, హన్మండ్లు, సీనియర్ నాయకులు వెల్మల్ నరేందర్, ఆదిమూలం వీరేశం, గోజుర్ నరేందర్, ఎస్టి మోర్చా అధ్యక్షులు మల్లయ్య, యువమోర్చా అధ్యక్షులు శ్రీకాంత్, శివ కుమార్, మచ్చర్ల ప్రవీణ్, కోహినూరు భోజన్న, మల్లారెడ్డి, నాగేశ్వర్, గంగాధర్, మధు, శ్రీకాంత్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.