ఆర్మూర్‌లో కెసిఆర్‌ దిష్టిబొమ్మ దగ్దం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం అర్ధరాత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ని రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా, అక్రమంగా, అన్యాయంగా పోలీసులను ఉసిగొలిపి ఎందుకు అరెస్టు చేశారో తెలపకుండానే పోలీస్‌ స్టేషన్‌కు తరలించడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కెనాల్‌ బ్రిడ్జి పైన కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా కార్యక్రమం చేస్తుంటే ఇక్కడ సైతం పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు.

ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి, బీజేవైఎం ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో లీకులు, అవినీతి – అక్రమాలు, లిక్కర్‌ స్కాములు తప్ప తెలంగాణాకు ఒనగూడిరది ఏమీ లేదని, కెసిఆర్‌ కూతురు కవిత అక్రమ లిక్కర్‌ స్కామ్‌లో ఇరుక్కోవడం, టీఎస్పీఎస్సీ పరీక్షల నుంచి, 10వ తరగతి పరీక్షల వరకు అన్ని లీకులు చేసి విద్యార్థులను, నిరుద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా వారి జీవితాలతో కూడా కేసీఆర్‌ ఆడుకుంటున్నాడని మండిపడ్డారు.

ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం దురదృష్టకరమని, వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐటీ మంత్రి ట్విట్టర్‌ టిల్లు కేటీఆర్‌, అసమర్థ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ కూడా రాజీనామా చేయాలని, లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో గవర్నర్‌ కల్పించుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని బిజెపి డిమాండ్‌ చేస్తుందన్నారు.

ప్రతి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఒక పార్లమెంట్‌ సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేసే అవసరం ఏమచ్చిందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను, కవిత లిక్కర్‌ స్కాంలో ఇరుక్కోడాన్ని, పరీక్షల లీకుల విషయంలో ప్రజలు గమనిస్తున్న విషయాన్ని పక్కదోవ పట్టించడానికై బండి సంజయ్‌ను అరెస్టు చేశారా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వెంటనే బండి సంజయ్‌ని విడుదల చేయాలని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణలు కోరాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బిజెపి, అనుబంధ వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »