కామారెడ్డి, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లోని మౌలిక వసతుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య సిబ్బందిని అడిగారు. అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పేర్కొన్నారు.