ఎడపల్లి, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో పార్టీ జండాను ఎగురవేసి బీజేపీ శ్రేణులు మిఠాయిలు పంచుకొన్నారు. మండల అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారికంగా ఏప్రిల్ 6, 1980న ఆవిర్భావం జరిగిందని అంతకుముందు జనసంఫ్‌ు నుండి 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేత స్థాపించబడిరదని అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన తర్వాత, జనసంఫ్‌ు కొన్ని ఇతర పార్టీలతో కలిసి 1977లో ‘జనతా పార్టీ’ని ఏర్పాటు చేసిందని అన్నారు.
మూడు సంవత్సరాల తరువాత, జనతా పార్టీ రద్దు చేసి అటల్ బిహారీ వాజ్‌పేయి మొదటి అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. రానున్న రోజులలో తెలంగాణ లో అధికారం లోకి వచ్చి తీరుతుందని అందుకు పోలింగ్ బూతు స్థాయి వరకూ కార్యకర్తలు నాయకులూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని బీజేపీ కీ ప్రజా ఆదరణ పెరుగుతుందని పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతంలో పరీక్ష పత్రాల లీకుల పర్వం కొనసాగుతుందని దీనిని ఆసరాగా చేసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో, జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేష్, మండల ప్రధాన కార్యదర్శి సృజన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కృష్ణ, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు గంగలత, బూత్ అధ్యక్షులు హరీష్, సంజీవ్, అజయ్, ప్రదీప్, గంగాధర్, మదన్, రాము, రాధ కృష్ణ, పార్టీమండల కన్వీనర్ సాయి, వీరేందర్, అరుణ్, బాబ్జి, దయానంద్ గౌడ్,పురం శేఖర్ పలు గ్రామల ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.