కామారెడ్డి, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి సెలవుల్లో మీ పిల్లలు సమయం వృధా చేయకుండా ఉండేందుకు … క్రమశిక్షణతో ఒత్తిడికి లోనవకుండా, సెల్ టాబ్‌లకు అడిక్ట్ కాకుండా సంస్కారము సదాచారము శిక్షణ, శ్రీ సరస్వతీ విద్యామందిర్ కామారెడ్డి ఆధ్వర్యంలో 5నుండి 13సంవత్సరాల వయసు గల బాలబాలికలకు సంస్కృతి సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని శ్రీ సరస్వతి విద్యామందిర్ కామారెడ్డి ప్రధానాచార్యులు ఒక ప్రకటనలోతెలిపారు.
ఇందులో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ద్వారా సుశిక్షితులైన అనుభవం కలిగిన ఆచార్యులు శిక్షణనిస్తారన్నారు.
శిక్షణ అంశాలు:
- సరస్వతీమాత ప్రార్థన, సూర్యనమస్కారాలు మంత్ర సహితంగ, యోగా ధ్యానం, ముద్రలు.
- నీతికథలు, భగవద్గీత శ్లోకాలు, పద్యాలు పలికించడం, సంక్షిప్త రామాయణకథా శ్రవణం.
- దేశభక్తి గీతాలు, అన్నమాచార్య కీర్తనలు నేర్పడం.
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చిన్న చిన్న ఆక్టివిటీల నిర్వహణ.
- వేదిక్ మ్యాథ్స్ స్పీడ్ మ్యాథ్స్ శిక్షణ.
తేది, సమయం : 5 మే నుండి 25 మే వరకు,
ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు.
స్థలం: శ్రీ సరస్వతీ విద్యామందిర్ హై స్కూల్, కాకతీయ నగర్ కామారెడ్డి.
ఫీజు రూ. 1000, పాఠశాలలో చెల్లించాలి లేదా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా క్రింది అకౌంట్ నెంబర్ 7143046464, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ : ఎస్‌బిఐఎన్‌ఓఆర్‌ఆర్‌డిసిజిబి కు పంపి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలన్నారు. ఫీజు చెల్లించి స్క్రీన్ షాట్ పెట్టిన వారిని సంస్కృతి-3 వాట్సాప్ గ్రుప్లో చేర్చడం ద్వారా మీ అడ్మిషన్ పూర్తవుతుందన్నారు.
మరింత సమాచారం కోసం 9490567960, 9440030305 నెంబర్‌లలో సంప్రదించగలరు.