కామారెడ్డి, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాల స్థాయిలో జిల్లాలోని వివిధ పాఠశాలలో విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా నేర్పాలన్న ఉద్దేశంతో వార్షిక ప్రణాళికను రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మికి కామారెడ్డి జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి తాడ్వాయి శ్రీనివాస్ అందజేశారు.
ఇందులో భాగంగా పరోపకారం, దేశభక్తి విద్యార్థుల్లో నీతి, నిజాయితీ పెంపొందించుటకు మూగజీవుల పట్ల సేవా మరియు ప్రకృతి, చెట్ల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అక్షరాస్యత పెంపొందించడం మరియు పెద్దవారిపట్ల మర్యాదగా ప్రవర్తించడం, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం ప్రథమ చికిత్స గురించి అవగాహన కలిగి ఉండడం లాంటి కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు మంచి ప్రవర్తన మరియు కార్యక్రమాలు నిర్వహించుటకు జిల్లాలోని స్కౌట్ మాస్టర్స్ మరియు గైడ్ క్యాప్టెన్ మరియు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులు నేర్చుకునే విధంగా వివిధ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ మాస్టర్స్, విద్యార్థులకు పాఠాల ద్వారా బోధించనున్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ సంధ్య, డిస్టిక్ ఆర్గనైజింగ్ కమిషనర్ వనజ, వీణ, గోపాల్ తదితరులు రాష్ట్రస్థాయిలో జరిగిన సమావేశంలో పాల్గొని జిల్లాకు సంబంధించిన వార్షిక కార్యక్రమాన్ని సిద్ధం చేసి అందజేశారు. కార్యక్రమంలో స్టేట్ అఫీషియల్స్ పరమేశ్వర్, అనంతలక్ష్మి, ఏఎస్‌ఓసి లింగం పాల్గొన్నారు.