నిజామాబాద్, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్ వద్ద చేపడుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణ పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. మరో మూడు పాఠశాలల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన కలెక్టర్, పనుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు నెలకొని ఉన్న వాటిని పరిశీలించిన మీదట, అక్కడే అధికారులతో కలెక్టర్ ఈ సమస్యలపై చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా, నాణ్యతతో పనులు పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ సారంగపూర్ డెయిరీఫారం వద్ద గల ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రవి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారి రమేష్, ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రాంతీయ సమన్వయకర్త బషీర్, నిజామాబాద్ రూరల్ తహశీల్దార్ సుదర్శన్, ఇంజినీరింగ్ విభాగం ఈ.ఈ దేవిదాస్ తదితరులు ఉన్నారు.