కామారెడ్డి, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి నియోజకవర్గానికి ఆరు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఈనెల 14న హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం, సమావేశం ఉందని తెలిపారు. మండలాల వారిగా బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, భోజన సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డి ఆర్ డిఓ సాయన్న, జెడ్పీ సీఈవో సాయగౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ఆర్టీవో వాణి, ఆర్టీసీ డిఎం మల్లేశం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.