కామారెడ్డి, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లోని కాంపోస్టు షెడ్లు వినియోగించి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సేంద్రియ ఎరువులను రైతులకు విక్రయించి పంచాయతీల సంపదను పెంపొందించుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో 100 శాతం ఇంటి పనులను వసూలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లోని వైకుంఠధామాలు వినియోగంలో ఉండే విధంగా చూడాలన్నారు. వైకుంఠధామాలలో విద్యుత్తు సౌకర్యం, నీటి వసతి కల్పించాలని చెప్పారు. వైకుంఠధామాల చూట్టు బయో ఫినిషింగ్ చేయాలని పేర్కొన్నారు.
నర్సరీలను సంరక్షించాలని సూచించారు. వచ్చే హరితహారం కార్యక్రమానికి మొక్కలు ఏపుగా పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగే విధంగా వాటికి నీటిని అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో డిపిఓ శ్రీనివాసరావు, డిఎల్పిఓలు సాయిబాబా, సురేందర్, శ్రీనివాస్, ఎంపీవోలు పాల్గొన్నారు.