కామారెడ్డి, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న శిరీష (23) కు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్త నిధి కేంద్రాలలో దొరకపోవడంతో పట్టణంలోని ఈశ్వర్ దాస్ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని డాక్టర్ బాలు తెలిపారు.
రక్తదానం చేసిన రక్తదాతకు ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వి.టీ.ఠాగూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు చందన్, ఏసుగౌడ్ పాల్గొన్నారు.