కామారెడ్డి డాన్స్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు

కామరెడ్డి, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా కామారెడ్డి జిల్లా డాన్స్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ని ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిగా హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌ లో జరిగినటువంటి తెలంగాణ డ్యాన్స్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్‌ రెడ్డి మరియు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల వారీగా కమిటీలను నియపిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు మంత్రివర్యులు పేర్కొన్నారు.

కమిటీలలో భాగంగా కామారెడ్డి జిల్లా డాన్స్‌ స్పోర్ట్స్‌అసోసియేషన్‌ ను కూడా ఏర్పాటు చేసినట్లు, ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా వంశీ ప్రతాప్‌, అధ్యక్షులుగా కార్తీక్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్‌, ఉపాధ్యక్షులుగా మధుసూదన్‌ రెడ్డి, కోశాధికారిగా బద్రి, మరియు సభ్యులను ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో గల డాన్స్‌ మాస్టర్లు అందరూ సభ్యత్వం తీసుకోవాలని, రాబోవు రోజుల్లో కామారెడ్డి జిల్లా నుండి ఒలంపిక్స్‌లో డాన్స్‌ స్పోర్ట్స్‌ కళాకారులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.

ఏప్రిల్‌ 29వ తేదీన ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కళాభారతిలో జరిగే కార్యక్రమంలో ఆసక్తిగల కళాకారులకు డాన్స్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640355129, 9963115046 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »