కామారెడ్డి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే ముఖ్య అతిథులుగా ముస్లిం ఉద్యోగ సోదరులకు టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. గత సంవత్సరం లాగా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించడం చాలా శుభపరిణామం అని, మతాలకతీతంగా ఐకమత్యంతో పండగలు జరుపుకోవాలని సూచించారు. హిందూ,ముస్లింలు సోదరభావంతో పండుగలను నిర్వహించుకోవాలని అన్నారు. రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడారు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా టీఎన్జీఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ గార్లకు, జిల్లా అధికారులకు టీఎన్జీవోస్ కార్యవర్గ సభ్యులకు ముస్లిం ఉద్యోగ సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అధికారులు రాజారాం, దయానంద్, శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి బి. సాయిలు, సహాధ్యక్షులు ఎం నాగరాజు, కోశాధికారి ఎం దేవరాజు, ఉపాధ్యక్షులు ఎం చక్రధర్, యూ. సాయిలు, జే శ్రావణ్, ఎంసీ పోచయ్య, బి. లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ గణేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, కల్చరల్ సెక్రెటరీ రాజ్‌కుమార్, ఈసీ నెంబర్ శ్రీకాంత్, టిఎన్జీవోస్ కామారెడ్డి అర్బన్ తాలూకా అధ్యక్షులు వెంకటేశం కార్యదర్శి శివకుమార్, టీఎన్జీవోస్ రూరల్ తాలూకా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవోస్ దోమకొండ తాలూకా అధ్యక్షులు సంతోష్ కుమార్, కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా పంచాయతీ సెక్రెటరీ పోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మెడికల్ అండ్ హెల్త్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు వెంకటి, పవన్, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు షఫీ, రాజు వారి కార్యవర్గ సభ్యులు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం మైనార్టీ ఉద్యోగ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.