కామారెడ్డి, ఏప్రిల్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న 16 నెలల చిన్నారికి బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారిగా చిన్న మల్లారెడ్డిలో విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి బి నెగిటివ్ రక్తాన్ని గురువారం ప్రభుత్వ వైద్యశాలలో గల రక్తనిధి కేంద్రంలో అందజేశారన్నారు.
రక్తదానం చేసిన రక్తదాత అశోక్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాసగుప్త, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు.