రెంజల్, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచమేధావి,విశ్వరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్132వ జయంతి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ రజినీకిషోర్,సర్పంచ్ రమేష్ కుమార్, మాలమహనాడు జిల్లా ప్రధానకార్యదర్శి జక్కలి సంతోష్ పూలమాలలు వేసి నివాళి ఘటించారు. బొర్గం గ్రామంలో జడ్పీటీసీ విజయసంతోష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాంచందర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.నీలా గ్రామంలో వైస్ ఎంపీపీ యోగేష్, ఎస్సై సాయన్న లు అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, సర్పంచ్ లు,వివిధ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సూచించిన అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయన ఆశయసాధనకు కృషి చేసినవరమౌతామని అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు తెలివితో,జ్ఞానంతో మహా రాజ్యాంగాన్ని రాసి దేశానికి దశ దిశ మార్గనిర్దేశం చేసిన మహా మేధావి అంబెడ్కర్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు.
తాడ్‌బిలోలిలో బైక్ ర్యాలీ
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీలు నిర్వహించారు.గ్రామంలోని ప్రధాన విధులగుండా అంబేద్కర్ నినాదాలతో ర్యాలీని చేపట్టారు. కార్యక్రమంలో నీరడి రవికుమార్, కిరణ్, ప్రభాకర్, కృష్ణ, సిద్ద సాయిలు, గైని రవి, సాకినిగారి రవి, సమేల్, సంతోష్, పోశెట్టి, శ్రీను, నరేష్, చంటి, రమేష్, ఎవన్, శ్రీచరణ్, శ్రావణ్, సంపత్, సందీప్, రోహిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.