కామారెడ్డి, ఏప్రిల్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న యువకుడు చింతల లక్ష్మణ్‌కి ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభింలేదు. వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో అర్థశాస్త్ర అద్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న బంధం ప్రవీణ్ కుమార్, కామారెడ్డి బిఆర్‌ఎస్ నాయకుడు గెరిగంటి లక్ష్మీనారాయణలు మానవతా దృక్పథంతో స్పందించి రక్తాన్ని శనివారం కామారెడ్డి రక్తనిధి కేంద్రంలో అందజేశారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాసగుప్త, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ సంతోష్ పాల్గొన్నారు.