కామారెడ్డి, ఏప్రిల్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 30లోగా 2021-2022 యాసంగి బియ్యంను రైస్ మిల్లుల యజమానులు గోదాములకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం గోదాంల అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
కాంట్రాక్టర్లు గోదాములలో ఖాళీ స్థలాలను గుర్తించి, బియ్యంను నిలువ చేసుకోవాలని తెలిపారు. వచ్చిన లారీల నుంచి బియ్యాన్ని ఎప్పటికప్పుడు దించుకోవాలని సూచించారు. రైస్ మిల్లర్లు సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఎస్‌ఓ పద్మ, అధికారులు రివిజన్ అహ్మద్, ప్రసన్న కుమార్, మహేష్ కుమార్, చంద్రశేఖర్, కాంట్రాక్టర్లు భాస్కర్ రెడ్డి, నవీన్, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగం, ప్రతినిధులు పాల్గొన్నారు.