ఆర్మూర్, ఏప్రిల్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, గ్రామాలలోని బ్రాంచ్ పోస్టాఫీసులలో ఎక్కడైనా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టీఫికెట్ – 2023 గురించి సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చని శనివారం నిజామాబాద్, ఆర్మూర్ పోస్టల్ అదనపు ఎస్పీ యాపరు సురేఖ ఒక ప్రకటనలో కోరారు.
భారత ప్రభుత్వం తపాలా శాఖ మహిళలకు మరియు ఆడపిల్లలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ -2023 ఇందులో 18 సంవత్సరాలు నిండిన మహిళలు మరియు మైనర్ ఆడపిల్లల పేరు మీద సంరక్షకులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చన్నారు.ఈ ఖాతాను కనిష్టంగా 1000 రూపాయలతో మరియు గరిష్టంగా 2 లక్షల వరకు జమ చేయవచ్చని, గరిష్ట విలువ దాటకుండా ప్రతీ 3 నెలల వ్యవధిలో ఎన్ని ఖాతాలైన ప్రారంభించవచ్చన్నారు.
అత్యధిక వడ్డీ రేటు లభించును 7.5 శాతం వడ్డీ ప్రతీ సంవత్సరం లభిస్తుంది. ఖాతా కాల వ్యవధి 2 సంవత్సరాలు, జమ అయిన మొత్తంలో ఒక సంవత్సరం తర్వాత 40 శాతం వరకు పాక్షికంగా ఉపసంహరణ చేసుకొనే సౌకర్యం ఉంటుందన్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 6 నెలల తర్వాత 5.5 శాతం వడ్డీతో ఖాతాను ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చన్నారు.
కావలసిన పత్రాలు:
ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు 3 ఫోటోలు మీ దగ్గరలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ , సబ్ పోస్ట్ ఆఫీస్ ,బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో ఎక్కడైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఇప్పటికే వివిధ సేవలను విస్తృతం చేసిన తపాలా శాఖ ఇటీవలే పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచడమే కాక మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పిందని, మహిళలకు హార్థిక పరిపుష్టి కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ – 2023 పేరిట కొత్త స్కీం ప్రవేశపెట్టిందని ఈ స్కీమ్‌ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా పోస్టల్ అదనపు ఎస్పీ యాపరు సురేఖ కోరారు.