కామారెడ్డి, ఏప్రిల్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 21 నుంచి 23 వరకు జరిగే ధ్యాన శిబిరం వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధ్యాన శిబిరం ప్రతినిధులు మాట్లాడారు. హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్ట్యూట్ రామచంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్ ధ్యాన్, అర్ దిల్ ధ్యాన్ ఆసనాలు, ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశుమందిర్ హైస్కూల్ ఆవరణలో ఈనెల 21, 22, 23 వ తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు ధ్యాన శిబిరం కొనసాగుతుందని తెలిపారు.
బిపి, మధుమేహం, ఒత్తిడి, థైరాయిడ్, ఉబకాయం ఉన్నవారికి ప్రత్యేక ఆసనాలు మూడు రోజులపాటు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ధ్యాన శిబిరం ప్రతినిధులు భానుమతి, బాల్ రెడ్డి, మనోహర్, ఆనంద్ రావు పాల్గొన్నారు.