అన్ని సమస్యల పరిష్కార మార్గం అంబెడ్కరిజమే

ప్రొఫెసర్‌ లింబాద్రి, చైర్మన్‌ ఉన్నత విద్యా మండలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పరిష్కారానికి అంబెడ్కర్జమే ఏకైక మార్గమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి స్పష్టం చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల ఏర్పాటు చేయడమంటే భవిష్యత్తుకు దిశ మార్గమని అన్నారు. ఆదివారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో బహుజన విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో బహుజన మహనీయుల జయంతోత్సవాలు జరిగాయి.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ లింబాద్రి మాట్లాడుతూ మహనీయులు డా.అంబేద్కర్‌ విగ్రహలు ప్రపంచంలోనే అందరి మహనీయుల విగ్రహాల కంటే అధికంగా ఉన్నాయన్నారు. మహనీయుని గురించి ఎన్ని పుస్తకాలు, విగ్రహాలు ఏర్పాటు చేసినా మహనియుడి గురించి చాలా తక్కువ అర్థం చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహనియుల విగ్రహాలతో జ్ఞాపకాలు, భవిష్యత్తుకు బాటలు గుర్తుకొస్తాయని వెల్లడిరచారు.

అంబేద్కర్‌ గురువులు కబీర్‌, పూలే అని ఆయన తెలిపారని సందర్భంగా గుర్తు చేశారు. అంబేద్కర్‌ ఒక ప్రశ్న వెతుక్కుని ప్రయాణం చేశాడని, అదే నేడు రాజ్యాంగంగా రచించ బడిరదని, ఆయన విగ్రహాలు దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా ప్రత్యేకమన్నారు. అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్‌ పేరుపై ప్రత్యేకమైన లైబ్రరీ ఏర్పాటు చేసి అక్కడ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

విద్యార్థులకు అంబేద్కర్‌ ను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని, అందరికీ దారి దీపమైన ఆయన ముందే అక్షరాభ్యాసం చేయవచ్చని చైర్మన్‌ స్పష్టం చేశారు. అంబేద్కర్‌ దేశానికి ఒక మాడల్‌ గా అన్ని రకాల సమస్యలకు ఒకే ఒక్కటి పరిష్కార మార్గంగా అనేక గ్రంధాల్లో పొందుపరిచారని తెలిపారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో భారతదేశంలో కులం పుట్టుపూర్వోత్తరాలపై రీసెర్చ్‌ పత్రం సమర్పించారని తెలిపారు. జీవితంలో కష్టాలను అవమానాలు, అసమానతలు 1935 లో చేసిన నిరంతర ప్రయత్నం చేసారన్నారు. మేధావులతో చర్చించి ఒప్పించి అంటరానితనం నేరమని రాజ్యాంగంలో పొందుపొచ్చారని అన్నారు.

అంబేద్కర్‌ రాజ్యాంగంలో హక్కులను రాసి ఉండకపోతే మాట్లాడే హక్కు ఉండేది కాదని ప్రొఫెసర్‌ లింబాద్రి స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 3 లేకపోతే తెలంగాణ రాష్టం ఏర్పడేదీ కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్త్రీలకు రిజర్వేషన్‌ కల్పించడం కోసం న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశారని తెలిపారు. అంబేద్కర్‌, అంబేద్కర్‌ గ్రంథాలపై ప్రతి గ్రామంలో ప్రతిచోట చర్చ జరగాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి బహుజన విద్యార్థుల వేదిక జిల్లా అధ్యక్షులు ప్రభాకర్‌ అధ్యక్ష వహించగా వక్తలుగా వీజీఆర్‌ నారగోని, డాక్టర్‌ జిలకర శ్రీనివాస్‌, డాక్టర్‌ పున్నయ్య, డాక్టర్‌ విజయలక్ష్మి, న్యాయవాదులు బాస రాజేశ్వర్‌, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్‌ రవీందర్‌, జమాతే ఇస్లాం హింద్‌ నాయకులు హుస్సేన్‌ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు స్థానిక పులాంగ్‌ చౌరస్తా అంబేడ్కర్‌ విగ్రహం నుండి రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »