కామారెడ్డి, ఏప్రిల్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తుందని మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావు అన్నారు. మాచారెడ్డి మండలం సోమార్పేటలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తక్కువ ధరకు రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మాట్లాడారు. రైతులు శుభ్రపరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించాలని తెలిపారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2060, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2040 నిర్ణయించిందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నీలా, డిఎస్‌ఓ పద్మ, మండల వైస్ ఎంపీపీ నరసింహరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పూల్ చంద్, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.