నందిపేట్, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో అడ్వకేట్ సాయికృష్ణ రెడ్డి ఇంటి వద్ద గల పురాతనమైన గ్రామ దేవత మైసమ్మ తల్లి మందిరము ఆధునీకరణ పనులకు, స్లాబ్ పనులను శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మందిరం పురాతనమైనదని చాలా విశిష్టత గల మందిరమని మహారాజు తెలిపారు.
శిథిలావస్థకు చేరుకున్న మందిరాన్ని ఆధునీకరించడం చాలా గొప్ప విషయమన్నారు. సాయి కృష్ణారెడ్డి కుటుంబీకులు సొంత ఖర్చులతో మందిరాన్ని ఆధునీకరించడం గొప్ప విషయమని, పురాతన మందిరాలను కాపాడుకోవాలని ప్రతినిత్యం పూజలు చేయాలని మహారాజు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోవింద్ రెడ్డి, కొత్తూరు రాజేశ్వర్, ఉప సర్పంచ్ రామచందర్, వార్డు సభ్యులు భరత్, గంధం సాయిలు గ్రామ ప్రజలు శంకర్, బడికిలింగం పాల్గొన్నారు.