రెంజల్, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆరుకాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని విక్రయించాలని విండో చైర్మన్ మోహినోద్దీన్ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ వికార్ పాషాతో కలిసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరుకాలం పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి అధిక లాభాలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లత సాయిలు, ఎంపీటీసీ హైమద్, సీఈవో రాము, రైతులు తదితరులు పాల్గొన్నారు.