రెంజల్, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివోఏలు ఈ నెల 24 న చేపడుతున్న నిరవధిక సమ్మె నోటీసులను మంగళవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శంకర్,ఏపీఎం చిన్నయ్యలకు వివోఏలు సమ్మె నోటీసులను అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.ప్రభుత్వం వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించలని కనీస గౌరవ వేతనం రూ. 18000 ఇవ్వాలని, రూ. 10 లక్షల సాధారణ భీమను, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి స్పందన రాలేదని తప్పనిసరి పరిస్థితుల్లో వివోఏల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా ఈనెల 24న నిరవధిక సమ్మె చేపడతామని తెలియజేస్తూ సమ్మె నోటీసులను అందజేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాలని లేడీ ఎడల సమ్మెను ఉదృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివోఏల మండల అధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి లక్ష్మీ, సంధ్యా, భాగ్యలక్ష్మీ, మంజూష, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.