రెంజల్, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని తము పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు క్యాతం యోగేష్ అన్నారు. మంగళవారం మండలంలోని నీలా గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం చిన్నయ్య స్థానిక సర్పంచ్ లలిత రాఘవేందర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి అధిక లాభాలు అర్జించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గడ్డం స్వప్న రాంచందర్, బిఆర్‌ఎస్ మైనార్టీ మండల అధ్యక్షుడు గఫర్, సీసీ రాజయ్య, రైతులు తదితరులు ఉన్నారు.