బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడంలో భాగస్వాములు కావాలని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని చెప్పారు. మండలాల వారిగా సభ్యత్వ నమోదుపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని పేర్కొన్నారు. పోషకార లోపంతో ఉన్న పిల్లల్ని గుర్తించి అదనంగా పౌష్టికాహారం అందే విధంగా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు.

బాల్యవివాహాలు జరగకుండా రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఆరోగ్య మహిళా, కంటి వెలుగు కార్యక్రమాలు విజయవంతమయ్యే విధంగా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం తడి చెత్త, పొడి చెత్త వేరుచేసి గ్రామాల్లోని ప్రజలు చెత్త బండి ఇచ్చే విధంగా చూడాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

బాల కార్మికుల నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు. బడి ఈడు పిల్లలు ఉంటే గుర్తించి వారిని బడుల్లో చేర్పించాలని చెప్పారు. జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ ఎం. రాజన్న మాట్లాడారు. 1500 మందిని నూతన సభ్యత్వ నమోదు చేయిస్తామని తెలిపారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా పేదలకు సేవ చేసే అవకాశం రావడం దేవుడిచ్చిన గొప్ప వరంగా సభ్యులు భావించాలని చెప్పారు. జిల్లా కార్యదర్శి రఘుకుమార్‌ ఏడాది కాలంలో చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సేవలు అందించిన రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులకు శాలువాలు కప్పి, మేమేంటోలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవరెడ్డి, జిల్లా వైస్‌ చైర్మన్‌ నాగరాజు గౌడ్‌, ప్రతినిధులు దస్తిరం, విక్రం, బాలు, రమేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »