మన ఊరు మన బడి నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు- మనబడి కార్యక్రమం కింద నిర్మిస్తున్న పాఠశాల భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్‌ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో మన ఊరు- మనబడి కార్యక్రమంలో చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ప్రతి మండలంలో 8 భవనాలను పూర్తిచేయాలని తెలిపారు. మండలాల వారిగా చేపట్టిన భవనాల నిర్మాణం పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఇంజనీరింగ్‌ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.12, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »