కామారెడ్డి, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్పార్క్‌లెస్ సమ్మర్‌క్యాంప్ వాల్ పోస్టర్లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. టీఎస్‌డబ్ల్యూఆర్, టిటి డబ్ల్యూఆర్, టీఎస్‌ఈఎస్, ఎంజెపిటిబిసి (ఇంగ్లీష్ మీడియం) గురుకులాల్లో ఎంపిక చేయబడిన పాఠశాలల్లో 15 రోజులపాటు ప్రతి క్యాంపు నందు నాలుగు టీమ్లలో 200 మంది విద్యార్థులకు స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్ 2023న ఎంపిక చేయబడిన క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈనెల 22 నుంచి మే 6 వరకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు సంపత్ కుమార్, కృతమూర్తి, సత్య నాథ్ రెడ్డి, అమర్ సింగ్, శోభారాణి పాల్గొన్నారు.