యూనిఫామ్‌ సర్వీస్‌లో ఫైర్‌శాఖ సేవలు అమోఘం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనిఫామ్‌ సర్వీస్‌లోని అన్ని శాఖలతో పోలిస్తే అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు ఆమోగమని జిల్లా ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి అన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఫైర్‌స్టేషన్లో ఏర్పాటుచేసిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

యూనిఫాం సర్వీస్‌ అంటేనే నిరంతరం అప్రమత్తంగా ఉండటమేనని ఆయన గుర్తు చేశారు. కొంత సమయం ఆలస్యమైనా ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు సంభవించే ప్రమాదం ఉంటుందని ఆయన తెలిపారు. అందుకనే ఫైర్‌ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తుందని ఆయన సిబ్బందిని ప్రశంసించారు. గతంతో పోలిస్తే అగ్ని ప్రమాదాలు ఎన్నో విధాలుగా సంభవిస్తున్నాయని తెలిపారు. గతంలో కేవలం గుడిసెలు గడ్డివాములు సంభవించమని ఆధునికత పెరుగుతున్న నేటి రోజుల్లో షార్ట్‌ సర్క్యూట్‌తో పాటు ఇంకా ఎన్నో విధాలుగా అగ్నిప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు.

ఇదిలా ఉండగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అంతేకాకుండా పాఠశాలల్లో వారిని చైతన్యపరిచే విధంగా అవగాహన కల్పించడంతోపాటు వివిధ పోటీలను నిర్వహించడం ఎంతో ప్రయోజనకరమన్నారు. ఏదేమైనాప్పటికీ ఫైర్‌ సిబ్బంది సేవలు సమాజానికి ఎంత అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు జిల్లా అగ్నిమాపక అధికారి మురళి మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 490 అగ్ని ప్రమాదాలు సంభవించగా వాటిలో 26 కోట్ల 48 లక్షల 97 వేల రూపాయల ఆస్తిని కాపాడగలిగామని తెలిపారు.

అదేవిధంగా మూడు కోట్ల 98 లక్షల 75 వేల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 11 మంది ప్రాణాలను సజీవంగా కాపాడగలిగామని తెలుపుతూ మరో 24 మంది అగ్ని ప్రమాదాల్లో చిక్కుకొని మరణించడం విచారకరమన్నారు. ముగింపు వారోత్సవాల్లో భాగంగా ఫైర్‌స్టేషన్‌ ముందు ఫైర్‌ సిబ్బంది చేసిన ఫైర్‌ ఫైటింగ్‌ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.

అంతకుముందు అగ్నిమాపక శాఖ ఉపయోగించే పరికరాలు వాటి పనితీరు అగ్నిని చల్లార్చి పద్ధతులు, ఇంకా ఎన్నోరకాల పనితీరును అతిధులకు వివరించారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. తదనంతరం అగ్నిమాపక శాఖలో విశిష్ట సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన వారిని ఘనంగా సన్మానించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులను శాలువా జ్ఞాపికలతో సత్కరించారు.

కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంథని రాజేందర్‌ రెడ్డి, టౌన్‌ ఏసిపి కిరణ్‌ కుమార్‌, డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ జి. మురళి మనోహర్‌ రెడ్డి, అసిస్టెంట్‌ డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ వి. భాను ప్రతాప్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పి. నర్సింగ్‌ రావు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »