23న బసవ జయంతి

కామరెడ్డి, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బసవ జయంతి వేడుకలకు అన్ని వర్గాల ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, బహుజన సంఘాల ప్రతినిధులతో బసవ జయంతి వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

ఈనెల 23న కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్‌, అధికారులు, వీరశైవ జంగం సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »