కామారెడ్డి, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణం పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నాణ్యతగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దేవునిపల్లి శివారులో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆస్పత్రి భవన నిర్మాణం పనులను చూశారు. పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థుల వసతి గృహాల ఏర్పాటు కోసం రెండు అద్దె భవనాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.