కామారెడ్డి, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రామాల్లో రీడిరగ్ రూమ్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా గ్రంధాలయ సమస్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో రీడిరగ్ రూమ్ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
రీడిరగ్ రూముల్లో ఫర్నిచర్, దినపత్రికలు, మహనీయుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, డిఎల్‌పిఓ సాయిబాబా, అధికారులు పాల్గొన్నారు.