కామారెడ్డి, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ధ్యాన శిబిరం ద్వారా సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కలుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్ట్యూట్ రామచంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్ ధ్యాన్, అర్ దిల్ ధ్యాన్ ఆసనాలు , ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశు మందిర్ హై స్కూల్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ధ్యాన శిబిరంను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ధ్యానం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ధ్యాన శిబిరానికి హాజరుకావాలని సూచించారు. ప్రతిరోజు దినచర్యలో భాగంగా ధ్యానం, యోగాసనాలు, ముద్రలు చేయడం వల్ల బిపి, మధుమేహం, ఒత్తిడి, థైరాయిడ్, ఉబకాయం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ శిక్షణ ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ కృష్ణారావు మాట్లాడారు.
యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సదాశివనగర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ భానుమతి మాట్లాడారు. చిన్నతనంలోనే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పి వివేకవంతులుగా మార్చాలని తెలిపారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. పిల్లలకు చదువు, క్రీడలు నేర్పించి మనో ధైర్యం పెంపొందించే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా వివేకావర్దని పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ధ్యాన శిబిరం ప్రతినిధులు సురేందర్, బాల్ రెడ్డి,లక్ష్మి, శిరీష,నగేష్, అనిల్ కుమార్, మనోహర్ పాల్గొన్నారు.