వేల్పూర్, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని సూపర్వైజర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వారికి టీకా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు.
అలాగే వ్యక్తిగత శుభ్రత శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఫార్మాసిస్ట్ ధర్మపురి, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.