ఆర్మూర్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్ష స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని ఖాందేష్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శనివారం ఆర్మూర్ నియోజజవర్గ ఇంచార్జి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చడము కోసం తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశ్యముతో రక్ష స్వచ్చంధ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారిని అభినందించారు.
రక్ష సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ గార్లు రాజేశ్వర్ రెడ్డికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమములో మున్సిపల్ కౌన్సిలర్లు సంగీత ఖాందేష్, సుంకరి రంగన్న, అల్జాపూర్ మహేందర్, సంస్థ ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, విద్యా గోపి, కార్యనిర్వాహక కార్యదర్శి బేతు గంగాధర్, ఖాందేష్ సత్యం, తులసి పట్వారి, మీరా శ్రావణ్, తెలంగాణ జాగృతి మక్కాల సాయినాథ్, భాండారి నరేశ్, బారాస నాయకులు నర్మె నవీన్, హమీద్, ఖాందేష్ గంగా మోహన్, సుదర్శన్, నరేందర్, ప్రశాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.