30న బోధన్‌లో మహనీయుల జయంతోత్సవ సభ

రెంజల్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30న బోధన్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో జరిగే మహాత్మ జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రావ్‌ జయంతి ఉత్సవాల సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్‌ డివిజన్‌ కన్వీనర్‌ నీరడి ఈశ్వర్‌, ఉపాధ్యక్షుడు నీరడి రవికుమార్‌, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిమి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.

శనివారం మండల కేంద్రంలో మహనీయుల జయంతి ఉత్సవాల కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.రెంజల్‌ మండలం నుండి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. దేశానికి ఎంతో మేలు చేసిన నాయకుల జయంతి ఉత్సవాలను జరపడంలో ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నాయకుల సేవలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చైతన్య పరిచేందుకు డివిజన్‌ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలలో జరుపుతున్నట్లు ఈశ్వర్‌,కోటేశ్వరరావు,నీరడి రవికుమార్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, అమలాపురం మాజీ ఎంపీ హర్షవర్ధన్‌, దళిత సేన జాతీయ అధ్యక్షుడు రాజు హాజరవుతున్నట్లు చెప్పారు.

కరపత్రాలను ఆవిష్కరించిన వారిలో మాల మహానాడు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు సిద్ధ ప్రభాకర్‌, మండల యూత్‌ అధ్యక్షుడు సిద్ధ సాయిలు, ప్రతినిధులు సిద్ధ శివకుమార్‌, జక్కల అబ్బయ్య, నీరడి ప్రసాద్‌, మెరుగు పోశెట్టి, జక్కల జ్వితేష్‌, సూర్యకాంత్‌, కిషోర్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »